రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు
స్పాట్ వాయిస్, బ్యూరో: పోలీసు ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంటోంది. నిరుద్యోగులు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దరఖాస్తులు 2వ తేదీన మొదలు కాగా.. రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు గడువు ఉంది. అయితే, చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ముందు నుంచే దరఖాస్తు చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
Recent Comments