బాధితులకు తోడై నిలిచిన మంగపేట పోలీసులు
స్పాట్ వాయిస్, మంగపేట: మంగపేట మండలం శనగకుంట గ్రామంలో అగ్నిప్రమాద బాధితులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం పరామర్శించారు. ఈ సమయంలో మేష లక్ష్మి అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై అపస్మారకస్థితికి చేరుకోగా.. అక్కడే బందోబస్తు లో ఉన్న మంగపేట ఎస్సై తాహెర్ బాబా వృద్ధురాలిని ఎత్తుకుని వైద్యం కోసం శిబిరం వద్దకు తీసుకెళ్లారు. ఇదే కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ బాధితులకు ఇచ్చిన వస్తువులు తీసుకెళ్లడానికి ఓ మహిళ ఇబ్బంది పడుతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న మంగపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మాదాసు అనిల్ కుమార్ మరో యువకుడి సాయంతో పరుపు ఇతర సామగ్రిని బాధిత మహిళ ఇంటికి తీసుకెళ్లారు. పోలీసుల సాయానికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.
శభాష్ పోలీస్
RELATED ARTICLES
Recent Comments