గొడవలు కాకుండా పహారా
ఎంజీఎం మార్చురీలోనే మృతదేహం
గణపురంలో ఉత్కంఠ
స్పాట్ వాయిస్, గణపురం: గణపురంలో క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎస్సై కొట్టడాని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రశాంత్ పదిరోజుల పాటు చికిత్సపొంది శనివారం మృతి చెందాడు. అయితే ప్రశాంత్ మృతికి స్థానిక హోండా షోర్ యజమానితో పాటు ఎస్సై కారణమని ఇప్పటికే అతడి తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మృతుడు బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగుతారనే ఉద్దేశంతో మధ్యాహ్నమే మండలం కేంద్రంలో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా మృతదేహం వస్తే.. ఘర్షణలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీలోనే ఉంచారు. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను తెలుసుకుంటున్న ఎస్పీ సురేందర్ రెడ్డి.. పరిస్థితి చక్కబడితే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల చర్యతో.. గణపురంలో మరింత ఉద్రిక్త నెలకొన్నట్లు అయింది.
పోలీసుల అప్రమత్తత..
RELATED ARTICLES
Recent Comments