Saturday, April 19, 2025
Homeక్రైమ్హతవిధి.. ఎంతపనైంది...?

హతవిధి.. ఎంతపనైంది…?

పోలీసు జీపులో డీజిల్ పోయించి..
ఎస్సై సీటుకు ఎసరు పెట్టిన కానిస్టేబుల్…
స్పాట్ వాయిస్, వరంగల్ క్రైం: పోలీసు జీపులో డీజిల్ పోయించి ఎస్సై సీటు కిందకే నీళ్లు తెచ్చాడు ఓ కానిస్టేబుల్. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపి ఎస్సై సస్పెన్షన్ వరకు వెళ్లిన ఈ ఘటన హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది. వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన డిపార్ట్ మెంట్ ఉద్యోగికి భార్యతో ఏర్పడిన ఘర్షణ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ విషయంలో సదరు ఉద్యోగి తనకు భార్య నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలని, న్యాయం జరిగేలా సాయం చేయాలని ఎస్సై సాంబయ్యను కోరాడు. ఈ క్రమంలోనే విచారణ కోసం వచ్చిన ఎస్సై వాహనానికి సదరు ఉద్యోగి డీజిల్ కొట్టించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, సదరు కానిస్టేబుల్ భార్య కేసు విషయమై ఎస్సై పై తీవ్రంగా ఒత్తిడి పెంచడంతో వివాదం తారాస్థాయికి చేరింది. మహిళా విషయం వివాదం కావడంతో చేసేదేమీ లేక ఎస్సై బాధితురాలు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తీవ్రంగా కలత చెందిన కానిస్టేబుల్ జీపులో డీజిల్ పోయించిన విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా ఎస్సై సాంబయ్య పై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments