కొత్తూరు లో కార్డెన్ సెర్చ్
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో 35 మంది పోలీస్ సిబ్బందితో బుధవారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కొత్తూరు లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు అణువు అణువు గాలించి నేరస్తులను పట్టుకోవాలని, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ ఆధ్వర్యంలో , వర్ధన్నపేట సీఐ సదన్ పర్యవేక్షణలో , ఎస్సైలు బండారి రాజు మాధవ్, 35 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు. బెల్ట్ షాప్స్ ,ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్మేవారు, ఎలాంటి నెంబర్లు, అడ్రస్సులు లేని మోటార్ సైకిల్ ఆటోలు ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఆటోలు తనిఖీ చేశారు. ఇన్సూరెన్సు లేని వాహనాలు సిజ్ చేసి 5 వాహనాలు కు ఇన్సూరెన్సు చేయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. వారి చర్యలను కట్టడి చేయడానికి వరంగల్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాలని ఆదేశించారు. 11 ఆధారాలు లేని ద్విచక్రవాహనాలు , 2 ఆటోలు, 72 అంబర్ పాకెట్స్, 42గుట్కా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.
Recent Comments