పున్నేల్ లో కార్డన్ అండ్ సెర్చ్
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: వరంగల్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ ఈస్ట్ వెంకటలక్ష్మి ఆదేశాల మేరకు, మామునూర్ ఏసీపీ ఏ. నరేష్ కుమార్, పర్వతగిరి సర్కిల్ఇన్ స్పెక్టర్ డి విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో ఐనవోలు మండలం పున్నేల్ గ్రామంలో శనివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 12ఆటోలు, 55 ద్విచక్ర వాహనాలను గురించారు. సదరు వాహనాలకు చాలనా వేశారు. 10 ఇసుక ట్రాక్టర్లు, 4500 విలువైల మద్యం, 2500- విలువగల గుట్కా, 01-కర్ర ట్రాక్టర్ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పున్నేలు గ్రామంలో గ్రామా పంచాయతీ వద్ద 4జి కి సంబంధించిన గుట్కా, గంజాయి, గ్యాంబ్లింగ్, గుడంబా పైన అవగాహన కల్పించారు. ఎవరైనా గుడుంబా, గంజాయి వినియోగించిన, అమ్మినా వారి గురించి వెంటనే తెలపాలని గ్రామ ప్రజలకు సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన, 100 డయల్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో లో మామునూర్ ఏసీపీ ఏ. నరేష్ కుమార్. పర్వతగితి సీఐ లు డి విశ్వేశ్వర్, రమేష్ , వెంకటేశ్వర్లు , ఐనవోలు ఎస్సై భరత్ తో పాటు పర్వతగిరి, సంగెం ఎస్సైలు, 50-మంది పోలీస్ సిబ్బంది, సర్పంచ్ కత్తి దేవేందర్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ,ఎంపీటీసీ చాట్ల అరుణ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
Recent Comments