స్పాట్ వాయిస్ , హైదరాబాద్: జూలై 2 నుంచి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జూలై 3న ప్రధాన మంత్రి మోడీ భాగ్యనగరానికి రానున్నారు. ఈ క్రమంలో నగరంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్ వెలవడం తీవ్ర కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో టీవోలీ థియేటర్ ఎదురుగా మోడీకి వ్యతిరేకంగా హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. తెలంగాణకు చేసిందేమీ లేదంటూ.. ‘సాలు మోడీ.. సంపకు మోడీ.. బై..బై.. మోడీ’ అంటూ బ్యానర్లు కనిపించాయి. మోడీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఈ హోర్డింగ్‌లు, బ్యానర్లు కలకలం సృష్టించాయి.విషయం తెలుసుకున్న పోలీసులు హోర్డింగ్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ హోర్డింగ్‌లు ఎవరు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
Recent Comments