అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దు
-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఎల్గూరు రంగంపేట చెరువును సందర్శించిన ఎమ్మెల్యే
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్:వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట చెరువును పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, చెరువు కట్టకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే,స్థానిక పోలీస్ అధికారులకు కాని,డయల్ 100కి ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి తోడుగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు ఎవరూ కూడా వెళ్లవద్దన్నారు. చెట్ల కింద,పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదన్నారు.
ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో చెరువులోకి,నాలాలు , వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు వెళ్ళరాదని, అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని అన్నారు. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుందని, కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు.మత్స్యకారులు చేపల వేటకు అస్సలు వెళ్లకూడదని కోరారు.వారి వెంట వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు,ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు ఉన్నారు.
Recent Comments