Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుగెలుపే లక్ష్యంగా పని చేయాలి..

గెలుపే లక్ష్యంగా పని చేయాలి..

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

 

కేంద్ర సహాయ మంత్రి బీ ఎల్ వర్మ 

స్పాట్ వాయిస్ దామెర: రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని కేంద్ర సహకార శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ సహాయ మంత్రి బీ ఎల్ వర్మ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దుర్గంపేట గ్రామ శివారులోని ఎం ఎస్సార్ కన్వెన్షన్ హాలులో మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా, పరకాల నియోజకవర్గంలో పూర్వ బీజేపీ, సీనియర్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహకార శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ హాజరై వారికి అభినందనలు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ మాట్లాడుతూ… పార్టీకి సీనియర్ కార్యకర్తలు బలమైన పునాదిగా ఉండడం వల్లనే నేడు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అజేయ శక్తిగా ఎదిగిందని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం సీనియర్ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం అదే స్ఫూర్తితో నేటి యువ నాయకత్వం పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,జిల్లా ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ ,హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పరకాల నియోజకవర్గ ఇంచార్జు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఒంటెరు జయపాల్,రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్ ,గుజ్జ సత్యనారాయణ,డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంతి లాల్,కొండి జితేందర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరామ్ రెడ్డి,ముత్యాల శ్రీనివాస్ గౌడ్,దామెర మండలాల అధ్యక్షులు జంగిలి నాగరాజు,సదానందం, డివిజన్ అధ్యక్షులు, పూర్వ బీజేపీ నాయకులు, జిల్లా పదాధికారులు, మండల పదాది కారులు, వివిధ మోర్చాల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments