స్పాట్ వాయిస్, డెస్క్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం బీహార్ నుంచే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరుతారని తొలుత భావించినా.. భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా రోజులుగా తాను అర్థవంతమైన ప్రజాస్వామ్యంలో భాగస్వామిగా ఉన్నానని, ప్రజలకు అవసరమైన పాలసీల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇప్పుడు రియల్ మాస్టర్‌గా మారే సమయం వచ్చిందన్నారు. అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు, జన్ సురాజ్ మార్గంలో వస్తున్నానని, బీహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్ననట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Recent Comments