డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
స్పాట్ వాయిస్, హన్మకొండ: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఫిజియోథెరపీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. హన్మకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పక్షవాత రోగులు, వెన్నెముక సంబంధిత వ్యాధులు, నడుము, మెడ, మోకాళ్ల నొప్పి కాళ్లు చేతులు లాగడం, చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో వారికి తగినట్టుగా ఫిజియోథెరపీ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేకుండా పోవడం కారణంగా పేదలు మంచాలకే పరిమితమై మరణిస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరపీ హాస్పిటల్ ఏర్పాటు విషయమై పలుమార్లు వైద్య శాఖ అధికారులకు మంత్రులకు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య శాఖ అధికారులు దృష్టిసారించి ప్రభుత్వ ఫిజియోథెరపీ వైద్య కళాశాల, ఫిజియోథెరపీ హాస్పిటల్ ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాము, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ సంపత్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ కమలాకర్, డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ హేమంత్, డాక్టర్ సునీల్, డాక్టర్ సుకుమార్, డాక్టర్ వంశీ, డాక్టర్ రాజు, డాక్టర్ వేణు, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ హరీష్, డాక్టర్ తాజుద్దీన్, డాక్టర్ సింధు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ జిల్లాలో ఫిజియోథెరపీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి : డాక్టర్ పెరుమాండ్ల
RELATED ARTICLES
Recent Comments