ఆన్ లైన్ గేమ్ తో సైకోగా మారిన యువకుడు
స్పాట్ వాయిస్, డెస్క్: ఆన్ లైన్ గేమ్ పిచ్చోన్ని చేసింది. గతంలోనూ ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై వింతగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చాలానే ఉన్నా.. తాజాగా రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో జరిగింది. బాన్సెన్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అన్సారీ అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై మతితప్పినట్లు ప్రవర్తిస్తున్నాడు. రోడ్లపైకి వచ్చి హ్యాకర్, హ్యాకర్.. పాస్వర్డ్ మార్చుకోండి అంటూ పిచ్చిగా ఆరుస్తున్నాడు. అన్సారీ గతంలో బిహార్‌లోని చప్రా ప్రాంతంలో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్‌లోని బాన్సెన్కు వచ్చాడు. గంటల కొద్దీ ఫోన్ పట్టుకునే ఉంటాడని, ఫైరింగ్ గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. గురువారం రాత్రి గేమ్స్ ఆడుతుండగా ఆకస్మత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్అయింది. ఆ తర్వాత మతిస్థితిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తించడం ప్రారంభించాడు. రహదారిపైకి చేరి వాహనాలను ఆపుతూ పాస్వర్డ్స్ మార్చుకోవాలంటూ ఆరవడం చేశాడు. గమనించిన స్థానికులు పట్టుకుని మంచానికి కట్టేశారు. అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి గేమ్స్ ఆడితే ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పారు.
పిచ్చోన్ని చేసిన సెల్ ఫోన్
RELATED ARTICLES
Recent Comments