Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుగణనాథుడి మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

గణనాథుడి మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

సంగెం ఎస్సై ఎం. భరత్
స్పాట్ వాయిస్, సంగెం: సంగెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సంగెం ఎస్సై ఎం భరత్ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు రోడ్డుకు ఆనుకొని మండపాలు వేయరాదని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, తప్పనిసరిగా విగ్రహం పెట్టే స్థలం యజమానితో పర్మిషన్ పొంది, కరెంటు డిపార్ట్మెంట్ మండల పరిధిలో ఏఈ పర్మిషన్ అదేవిధంగా పోలీస్ వారి పర్మిషన్ కూడా పొందాల్సి ఉంటుందన్నారు. నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు అత్యవసర సమయంలో 100కు డయల్ చేయాలని ప్రజలను కోరారు. సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారంతో http://policeportal.tspolice.gov.in/index.htm దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments