Sunday, November 24, 2024
Homeజాతీయంపేరణిని ప్రశంసించిన ప్రధాని..

పేరణిని ప్రశంసించిన ప్రధాని..

పేరణిని ప్రశంసించిన ప్రధాని

మోడీ వల్లే ఎల్లలు దాటుతున్న భారత సంస్కృతి 

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి 

స్పాట్ వాయిస్, హన్మకొండ : భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మోడీ ప్రధానమంత్రిగా ఉండడం వల్లే మరుగునపడుతున్న సంస్కృతికి పూర్వ వైభవం సంతరించుకుని ఎల్లలు దాటుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన 98 వ మన్ కీ బాత్ లో కాకతీయుల కాలం నాటి పేరణి శివతాండవం గురించి ప్రస్తావిస్తూ నృత్యం గొప్పదనానన్ని పునరుద్ఘాటించారు. కనుమరుగైన కొన్ని సంప్రదాయాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందరూ నడుం బిగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఏనుగుల రాకేష్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ వల్లే దేశంలో మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం సంతరించుకుని ఎల్లలు దాటుతున్నాయన్నారు. మన్ కీ బాత్ లో మోడీ పేరణి శివతాండవం గురించి మాట్లాడటం, ఆ నృత్య పూర్వ వైభవానికి పిలుపునివ్వడం ఓరుగల్లు పౌరుడిగా తనకు గర్వంగా ఉందన్నారు. గతంలోనూ ప్రధాని ఓరుగల్లు శక్తి స్వరూపిణి శ్రీ భద్రకాళీ అమ్మవారిని తన ప్రసంగం లో కొనియాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాకతీయుల కళా వైభవానికి ప్రతీ పేరణి శివతాండవం

కాకతీయుల కళా వైభవానికి పేరణి శివతాండవం ప్రతీకగా నిలుస్తుందన్నారు. త్యాగానికి, స్ఫూర్తిని రగల్చడానికి పేరణి శితతాండవాన్ని మించిన కళ లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి కొనియాడారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాంటి కళలను ప్రపంచానికి చాటేందుకు తాము కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రతీ ఏటా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో పేరణి శివతాండవానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మోడీ ప్రధాన మంత్రి అయ్యాక ఓరుగల్లుకు ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు, వరంగల్ కు గ్లోబల్ లెర్నింగ్ సిటీగా గుర్తింపు దక్కడం. ఓరుగల్లును హెరిటేజ్ సిటీ గుర్తించి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మోడీ నాయకత్వం వల్లనే సాధ్యమైందని కొనియాడారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ సిటీ పథకాల్లో మూడింటిలో ఓరుగల్లుకు స్థానం కల్పించడమని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూ్ర్తితో, సూచనలతో వారి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఓరుగల్లు కళలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments