తహసీల్దార్ ఎం. సత్యనారాయణ స్వామి
స్పాట్ వాయిస్, గణపురం: వాయుగుండం కారణంగా మరో రెండు రోజుల పాటు మండలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గణపురం తహసీల్దార్ ఎం. సత్యనారాయణ స్వామి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శిథిలమైన, పాత ఇళ్లలో ఉండవద్దని, చెరువులు, కాలువల వద్దకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1800 4251123 ప్లడ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ గాని, గణపురం తహసీల్దారు కార్యాలయం 98490 81855 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES
Recent Comments