కేంద్ర హోంశాఖ మంత్రిని విమర్శించే స్థాయి వారికి లేదు..
మంత్రి, ఎమ్మెల్యే వి ఊకదంపుడు ఉపన్యాసాలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని విమర్శించే స్థాయి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు లేదని, తుక్కుగూడ బహిరంగ సభలో అమిత్ షా వాస్తవాలు చెబితే తట్టుకోలేకే ఎర్రబెల్లి ప్రగల్బాలు పలుకుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో దళిత, ఓబీసీ మోర్చా కమిటీ లను ప్రకటించన అనంతరం కొండేటి శ్రీధర్ మాట్లాడారు. శరీరంలో అన్ని భాగాలు పని చేస్తేనే మనిషి చక్కగా ఉంటారని, అలానే అన్ని మోర్చాలు కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కి కావాల్సిన స్థలం కేటాయించలేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి దేవాదాయ భూములు ఇస్తే దానిని ఎండోమెంట్ శాఖ ఒప్పుకోలేదని, గిరిజన యూనివర్సిటీకి అటవీశాఖ భూములు ఇచ్చి వారి అసమర్థతను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తే ప్రజలు తప్పక బుద్ధి చెప్తారన్నారు. దేశంలో, రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డ్డాక మత ఘర్షణలు ఎక్కడైనా జరిగాయా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి ఏయే మంత్రిత్వ శాఖ నుంచి ఎన్నెన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో ధైర్యం ఉంటే శ్వేత పత్రం విడుదల చేసి, ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలన్నారు. పనికిమాలిన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ సంస్కార హీనంగా మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రత్నం సతీష్ షా, కుసుమ సతీష్, ఎరుకల రఘునారెడ్డి, బాకం హరిశంకర్, పగడాల రాజ్ కుమార్, బైరి శ్యామ్, మహంకాళి, బన్న ప్రభాకర్, నల్లబెల్లి సుదర్శన్, కూచన క్రాంతి కుమార్, నూతన మోర్చాల కమిటీల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలే బుద్ధి చెబుతారు…
RELATED ARTICLES
Recent Comments