వృద్ధులు , వితంతులకు రూ.4000 పింఛను
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు రూ.4000 పింఛను అందిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఖమ్మం సభలో ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు రూ.4000 పింఛను, ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తామన్నారు. కర్ణాటకలో అవినీతి సర్కారును కాంగ్రెస్ ఓడించిందని, కర్ణాటకలో కాంగ్రెస్కు అండగా పేదలు నిలిచారని చెప్పారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
Recent Comments