అర్హులందరికీ పెన్షన్లు
ఎమ్మెల్యే అరూరి రమేశ్
పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేత
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన 464మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆదివారం వర్ధన్నపేటలోని లక్ష్మి గార్డెన్స్ లో ఎమ్మెల్యే గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పెన్షన్లు
RELATED ARTICLES
Recent Comments