నా పెన్ను పోయింది..
కేసు పెట్టిన ఎంపీ
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్ , డెస్క్: పెన్ను పోతే.. ఎవరైనా.. వెంటనే కొత్త ది కొంటారు. కానీ ఈ ఎంపీ మాత్రం ఠాణా మెట్లు ఎక్కాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా…? ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకమని తెలిపారు. చెన్నైలో జరిగిన.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి ఇచ్చారని.. తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Recent Comments