Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలు'శభాష్ పెద్ది''

‘శభాష్ పెద్ది”

‘శభాష్ పెద్ది”

రాష్ట్రమంతా “ఉత్తర యుద్ధం” కొనసాగిద్దాం..

 టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అభినందన

స్పాట్ వాయిస్, నర్సంపేట : ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల ప్రారంభించిన ఉత్తరయుద్ధం కార్యక్రమం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు ఈ కార్యక్రమానికి తమ మద్దతును తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది. తాజాగా ఈ కార్యక్రమంపై నేడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అభినందించారు. రైతులకు మద్దతుగా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని అభినందించారు. ఈ ఉత్తరయుద్ధం కార్యక్రమాన్ని ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 119 నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఉత్తర యుద్ధం కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని కేటీఆర్ కోరారు. కేటీఆర్ అభినదించడం పట్ల ఎమ్మెల్యే పెద్ది సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments