Tuesday, April 22, 2025
Homeజిల్లా వార్తలుపోలీస్ సేవలను వినియోగించుకోవాలి

పోలీస్ సేవలను వినియోగించుకోవాలి

పోలీస్ సేవలను వినియోగించుకోవాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్ శాఖ అధ్వర్యంలో నర్సంపేట మండలం రాజపల్లి గ్రామంలో సురక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పోలీసుల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, నేర రహిత సమాజం కోసం అందరం కృషి చేయాలన్నారు. అనంతరం ఏసీపీ సంపత్ రావు పోలీస్ శాఖలో వచ్చిన నూతన సంస్కరణలు డయల్ 100, షీ టీమ్స్, భరోసా కేంద్రం, సీసీటీవీ కెమెరాల్లో ఉపయోగం, ఫ్రెండ్లీ పోలీస్, వంటి వాటి గురించి అవగాహన కల్పించారు. పోలీసులు అందిస్తున్న చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments