Tuesday, September 17, 2024
Homeజిల్లా వార్తలుడీలర్ డేర్.. వ్యాపారి పవర్..

డీలర్ డేర్.. వ్యాపారి పవర్..

 

డీలర్ డేర్.. వ్యాపారి పవర్..

సివిల్ సప్లై సంచులతోనే రేషన్ షాప్ నుంచి.. వ్యాపారి ఇంటికి.. 

గణపురం లో 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

పోలీసుల దాడుల్లో వెలుగులోకి

పట్టుబడిన బియ్యం విలువ రూ. 6లక్షల 71వేలు 

ఇద్దరిపై కేసు నమోదు

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మండల కేంద్రానికి సమీపంలోని కొత్తపల్లిలో ఇద్దరి ఇండ్లల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంంగా నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు తూర్పాటి శంకర్, పస్తం సారయ్య పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం చేస్తూ ఒక ఇంట్లో రూ.4,86,330ల విలువ గల 124.70 క్వింబాళ్ల బియ్యం, అదేవిధంగా అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన రూ. లక్ష 84 వేల విలువ చేసే 47.40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు ఈ బియ్యం ఆ ఇద్దరు తామే నిల్వ ఉందచినట్లు చెప్పడంతో వారి నుంచి 172 క్వింటాళ్ల బియ్యం స్వాదీనపరుచుకుని వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు వేసినట్లు ఎస్సై తెలిపారు. స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పజెప్పినట్లు చెప్పారు.

పిడిఎస్ rice

డీలర్ నుంచి నేరుగా కొనుగోలు…

నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఆక్రమంగా అమ్ముకుంటున్న డీలర్ల బాగోతం బయటపడింది. ఆదివారం మండల కేంద్రం శివారు కొత్తపల్లిలో జరిగిన పోలీసుల దాడుల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ దాడుల్లో పట్టుకున్న 172 క్వింటాళ్ల బియ్యంలో సీల్ తియ్యని 356 పీడీఎస్ బియ్యం సంచులు లభ్యమవ్వడంతో పోలీసులు, అధికారులు ఒక్కింత ఆశ్చర్యానికి గురైయ్యారు. సంచులపై ఉన్న సమాచారం ఆధారంగా ఆక్రమంగా ఏ డీలర్లు విక్రయించి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments