138 క్వింటాళ్లు స్వాధీనం
మూడురోజులుగా పోలీసుల అదుపులో..!
పట్టుకున్న రైస్ పై గోప్యమెందుకో..?
సెటిల్ మెంటా..? లేక మరేదైనాన..
స్పాట్ వాయిస్, గణపురం: మండలంలోని భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. మూడు రోజుల క్రితం 138 క్వింటాళ్లతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాహనాన్ని పట్టుకొని మూడు రోజులవుతున్నా.. మండల పోలీసులు మాత్రం విషయం బయటికి పొక్కనివ్వలేదు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి భారీగా పీడీఎస్ రైసు మహారాష్ర్ట తరలిపోతుంది. రేషన్ పంపిణీ మొదలైందంటే చాలూ రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులు యాక్టివ్ అవుతున్నారు. దందాకు కొంతమంది అధికారులు సహకరిస్తుండడంతో యథేచ్ఛగా రాష్ర్ట సరిహద్దు దాటిస్తున్నారు. పది రోజుల క్రితం భూపాలపల్లి లో రెండు డీసీఎం వాహనాల్లో వెళ్తున్న పీడీఎస్ రైస్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గణపురం మండలంలో మూడు రోజుల క్రితం పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మూడు రోజుల అనంతరం గణపురం పోలీసులు చెల్పూరు వద్ద విజిలెన్స్ అధికారులు దాడి చేసి 138 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చిన్నగా సమాచారం ఇచ్చారు. అయితే మూడు రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచినట్లో అనేది ప్రశ్నగా మారింది. మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించాల్సిన అధికారులు కేవలం వాట్సప్ ద్వారా నాలుగు లైన్లలో సమాచారం చేరవేయడంపై స్థానికంగా చర్చ సాగుతోంది.
గణపురంలో పీడీఎస్ బియ్యం పట్టివేత
RELATED ARTICLES
Recent Comments