గణపురం ఎస్సై అభినవ్
-కిరాణం షాపులపై పోలీసుల దాడులు
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పలు కిరాణం షాపులపై గురువారం ఎస్సై అభినవ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాల్లో అక్రమంగా నిషేధిత, అంబర్, గుట్కా, గుడుంబా విక్రయిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, విక్రయించిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గణపురం మండలంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కా, తదితర మత్తు పదార్థాలు కలిగి ఉన్నారని.., విక్రయిస్తున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Recent Comments