Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్పీసీసీ రియాక్షన్.. జగ్గారెడ్డి పదవుల ఔట్

పీసీసీ రియాక్షన్.. జగ్గారెడ్డి పదవుల ఔట్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు అప్పగించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు పీసీసీ ప్రకటించింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి సైతం జగ్గారెడ్డిని తప్పించినట్లు పేర్కొంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌పైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తనను సస్పెన్షన్‌ చేసినా భయపడేది లేదని.. రోజుకొకరి వ్యవహారాలు బయటపెడతానంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పీసీసీ.. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments