నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల డిమాండ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మె్ల్యే అభ్యర్థిగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని ప్రకటించాలని, ఆయన పార్టీకి చేసిన సేవలు, ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ శ్రేణులను చూసి.. టికెట్ ఇవ్వాలని పరకాల నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీపీ, పీఏసీస్ చైర్మన్లు కోరారు. ఈ మేరకు మంగళవారం హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారన్నారు. 2014 లో పరకాల నుంచి పోటీ చేసిన ఇనుగాల 40వేల ఓట్లు సాధించారని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, ఇన్నాళ్లుగా పార్టీ కోసం పని చేసిన ఇనగాలను తాము గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కొండా దంపతులు ఎప్పుడు పార్టీలో ఉంటారో.. ఉండరో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఆయన మరణాంతరం వైఎస్సార్ సీపీలో చేరారని, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పరకాలను వదిలి వెళ్లారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి మాత్రం.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అనునిత్యం పని చేస్తూనే ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్, వరంగల్‌లో జరిగిన రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు 25,000 మంది కేడర్‌ను సమీకరించారని చెప్పారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయంతం చేస్తూ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించి ఇనుగాలకు టికెట్ కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీటీసీ భీరం రజనీకర్ రెడ్డి, దూల వెంకటేశ్వర్లు, కార్యనిర్వహణ అధ్యక్షుడు ఈర్ల చిన్ని, ఆత్మకూరు మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, దామెర మండల అధ్యక్షుడు మన్నెంప్రకావ్, పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, పరకాల మండల అధ్యక్షుడు నలుబోల కృష్ణయ్య, నడికూడ మండల అధ్యక్షుడు దుర్ల దేవేందర్, గీసుగోండ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, జీడబ్ల్యూఎంసీ అధ్యక్షులు ఎలుగొండ ప్రవీణ్, దూపాకి సంతోష్, పసునూరి వేణుగోపాల్, ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఎరుకొండ రవి, వైస్ చైర్మన్ జనగాం ప్రభాకర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
పరకాల కాంగ్రెస్ టికెట్ ఇనగాలకే ఇవ్వాలి..
RELATED ARTICLES
Recent Comments