Tuesday, November 26, 2024
Homeతెలంగాణరాజకీయ కుట్రతోనే తమపై కేసులు

రాజకీయ కుట్రతోనే తమపై కేసులు

-డిటెయిల్స్ లేకుండా ఎఫ్ ఐఆర్ నమోదు దురదృష్టకరం
-రాధిక సిద్దేశ్వర్ దంపతులను ఎప్పుడూ చూడలేదు.. కలవలేదు..
-అన్ని అనుమతులు తీసుకునే భవన నిర్మాణాలు
అనురాగ్ యూనివర్సిటీ సీఈవో పల్లా నీలిమ
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉండి, పలు విద్యాసంస్థలు నడుపుతున్న ఎమెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్యనైన నాపై, మా సంస్థ ఉద్యోగి మధుకర్ రెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం దురదృష్టకరమని అనురాగ్ యూనివర్సిటీ సీఈవో పల్లా నీలిమా వాపోయారు..ఘట్ కేసర్ సమీపం లోని తన ప్లాట్ ను బలవంతంగా ఆక్రమించారనే ముచ్చర్ల రాధిక అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీలిమ, మధుకర్ రెడ్డిపై కేసు నమోదు కాగా, ఈ విషయ మై అనురాగ్ యూనివర్సిటీ సీఈవో పల్లా నీలిమా విలేకరులతో మాట్లాడారు. తమపై కుట్రతోనే కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందనే వివరాలు లేకుండా కేసు రిజిస్టర్ కావడం దురదృష్టకరమన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న రాధిక అనే వ్యక్తి ఆమె భర్త సిద్దేశ్వర్ రావును తాము ఎప్పుడు కలవలేదని, కనీసం చూడలేదన్నారు. నేను 2011 నుంచి అనురాగ్ యూనివర్సిటీకి వస్తున్నానని, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి 2015 నుంచి మేనేజింగ్ ట్రస్ట్రీగా, సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా అకడమిక్ ఆక్టివిటీస్ లో తప్పితే ఎక్కడా, ఎలాంటి విషయాల్లో నేను ఇన్ వాల్వ్ కాలేదని స్పష్టంచేశారు. అయితే సంబంధిత అధికారులు ఎఫ్ ఐఆర్ చేసే ముందు తమను సంప్రదించలేదని, మమ్మల్ని ఎలాంటి డాంక్యుమెంట్లు కూడా సబ్ మిట్ చేయమని అడగకుండానే కేసు ఎలా ఫైల్ చేస్తారని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో ఇలా కేసు నమోదు చేస్తారనే విషయం ఇప్పుడు కొత్తగా అనుభవంలోకి వచ్చిందని వాపోయారు. సమాజంలో ఉన్నత చదువులు చదువుకుని, గౌరవ ప్రదమైన వృత్తిలో ఉండి, పలు విద్యాసంస్థలు నడుపుతున్న ఓ శాసన సభ్యుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ, వాటిని మీడియాలో సర్క్యులేట్ చేయడం దారుణమన్నారు. సంబంధిత అధికారులు దయచేసి మా వివరణ తీసుకున్న తరువాతే ప్రొసీడ్ అయితే బాగుండేదన్నారు. గత కొన్నేళ్లుగా రాధిక తోపాటు మిగతా వ్యక్తులను ఎవరినీ కలవలేదని, వారిని కనీసం చూడలేదని, తామంటే గిట్టని వారు తమపై ఆరోపణలు చేస్తే సంబంధిత అధికారులు కావాలనే కేసు నమోదు చేశారని మేము భావిస్తున్నామన్నారు. మా ఆధీనంలో ఉన్న భూములను డెవలప్ మెంట్ కోసం తీసుకున్నామని, మా కళాశాలకు సంబంధించిన భవన నిర్మాణాలను అన్ని అనుమతులు తీసుకుని, ప్రభుత్వ నిబంధనల మేరకు కట్టామని, ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు తమపై ఉన్నాయన్నారు. ఒక వేళ వాళ్ల చేస్తున్న ఆరోపణలే నిజమైతే అది సివిల్ మ్యాటర్ అని, సివిల్ కోర్టుకు వెళ్లి ఫైట్ చేయాలని సూచించారు. మాకు చట్టంపై గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చివరకు న్యాయం గెలుస్తుందని పల్లా దంపతులు విశ్వసిస్తున్నారన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments