Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుపాలకుర్తి అంటే అభివృద్ధి

పాలకుర్తి అంటే అభివృద్ధి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: జనగామ జిల్లా పాలకుర్తి అంటే అభివృద్ధికి కేంద్రమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం కేంద్రంలో ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాలు, ప్రజలతో కలిపి మంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అత్యంత వెడల్పు అయిన రోడ్లు అభివృద్ధికి నిదర్శనమన్నారు. సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయని చెప్పారు. పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, మొదట్లో కొంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. విగ్రహాలను తొలగించాలని మాకూ లేదని ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని చెప్పారు. పాలకుర్తి ప్రధాన కూడలిలోని విగ్రహాలను శాశ్వతంగా తొలగించడం లేదని, త్వరలోనే వాటిని సముచితస్థానంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సైతం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అప్పటివరకు అంతా ఓపిక పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వ్యాపారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments