నిండుకుండాల సరస్సు..
మదన్నపేట చెరువు సైతం..
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: పాకాల సరస్సు మత్తడి దూంకుతోంది. పాకాల పూర్తిస్థాయి నీటి మట్టం 30.3 ఫీట్లు కాగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తి నిండింది. దీంతో మత్తడి పోస్తోంది. పాకాల సరస్సు విస్తీర్ణం 1,816 హెక్టార్లలో ఉంటుంది. మత్తడి పరవళ్లు తొక్కుతుండడంతో.. సందర్శకులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే మత్తడి వద్ద స్థానిక యువత మత్తడి నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. పాకాల సరస్సుతో పాటు మదన్న పేట చెరువు సైతం మత్తడి పోస్తుండడంతో రైతుల్లో ఆనందం తొంగిచూసింది.
మత్తడి పోస్తున్న పాకాల
RELATED ARTICLES
Recent Comments