Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలునర్సంపేట- కొత్తగూడ మధ్యలో నిలిచిన రాకపోకలు

నర్సంపేట- కొత్తగూడ మధ్యలో నిలిచిన రాకపోకలు

3ఫీట్లతో మత్తడి పోస్తున్న పాకాల సరస్సు
స్పాట్ వాయిస్ నర్సంపేట, ఖానాపురం : నాలుగు రోజులుగా ఎండతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వస్తున్న వరదనీరుతో ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని పాకాల సరస్సులోకి నీరు భారీగా చేరింది. దీంతో పాకాల సరస్సు మత్తడిపరవాళ్లు ఎగిసిపడుతున్నాయి. సుమారు 3ఫీట్ల ఎత్తుతో మత్తడి పోస్తోంది. అశోక్ నగర్ గ్రామ శివారులో ఉన్న లోకల్వర్టు బ్రిడ్జి పైనుంచి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తుండంతో దీంతో కొత్తగూడ నుండి నర్సంపేట అశోక్ నగర్ కు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు, వాహన దారులు అటువైపు వెళ్ళకుండా ఖానాపురం ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భార్గెట్లు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments