రైతులకు గుడ్ న్యూస్..
స్పాట్ వాయిస్, బ్యూరో: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను పెంచింది. సాధారణ వడ్లు క్వింటాల్ కు రూ.143 పెంచిన కేంద్ర ధరను రూ.2183గా నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.163 పెంచి రూ.2,203 గా ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి రూ8,558గా నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచింది. మద్దతు ధర పెంపు రైతులకు ఎంతో భరోసానిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
Recent Comments