పద్మశాలీలంతా ఐక్యంగా ఉండాలి
పరస్పరం సహకరించుకుని ఆర్థికంగా ఎదగాలి
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు
టీపీయూఎస్ సొంత భవనానికి చేయూత నిచ్చిన ఉద్యోగులకు సత్కారం
స్పాట్ వాయిస్, హన్మకొండ : పద్మశాలీలంతా ఐక్యంగా ఉండాలని, అన్ని రంగాల్లో రాణించేలా ఒకరికొకరం సహకరించుకోవాలని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. టీపీయూఎస్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా పరిషత్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. అన్ని రంగాల్లోని పద్మశాలీలు పరస్పరం సహకారం అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాల్లో రాణిస్తేనే మనకు గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు అనూహ్యంగా స్పందించి పద్మశాలి ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం సొంత భవనానికి చేయూత నిచ్చిన వంద మంది పద్మశాలి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కోడం రవి ప్రకాష్ , జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరైనారు, అలాగే అతిథులుగా కూరపాటి వెంకటనారాయణ, ఆళ్ల రాఘవేందర్, రవి కిరణ్, గొట్టిముక్కల సదానందం, కుసుమ సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరేందర్, శేషగిరి, చిలుక శ్రీనివాస్, పిట్ట ఉమాదేవి, కొండబత్తుల రాజమౌళి, చింతకింది శ్రీనివాస్, కరుణశ్రీ, వి.శ్రీనివాస్, సిరిపురం శేఖర్, గుర్రపు రాజమౌళి, దేవులపల్లి సాయి రాజు, కూచన రాజు, మేన వాణిశ్రీ, నల్ల మాధవి, వివిధ శాఖల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పద్మశాలీలంతా ఐక్యంగా ఉండాలి
RELATED ARTICLES
Recent Comments