Friday, November 22, 2024
Homeతెలంగాణపార పనికిపోతున్న పద్మ శ్రీ అవార్డు గ్రహీత

పార పనికిపోతున్న పద్మ శ్రీ అవార్డు గ్రహీత

స్పాట్ వాయిస్, బ్యూరో: ప‌ద్మ శ్రీ అవార్డు గ్రహీత‌ 12 మెట్ల కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శనం మొగిల‌య్య ప‌రిస్థితి అత్యంత దారుణంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ఈ నిరుపేద క‌ళాకారుడికి పింఛన్ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి ఆయ‌న‌కు అందాల్సిన గౌర‌వ వేత‌నం గ‌త ఐదు నెల‌ల నుంచి అంద‌డం లేదు. దీంతో మొగిల‌య్య దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు. దీంతో కూలీ ప‌ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ వారు ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. మొగులయ్య హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించాడు. అరుదైన సంగీత వాయిద్యమైన ‘కిన్నెర’ను తిరిగి ఆవిష్కరించినందుకు దర్శనం మొగులయ్యను 2022లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. మొగిల‌య్య కూలీ ప‌ని చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments