Saturday, November 23, 2024
Homeజాతీయంవడ్లు క్వింటాల్ రూ.2060

వడ్లు క్వింటాల్ రూ.2060

పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 17 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1940 ఉండగా.. మరో వంద రూపాయలు పెంచి, రూ.2040కి చేర్చారు. ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2060 వరకు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. డిసెంబరు దాకా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గాయని, రానున్న 6 నెలల్లో వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే తక్కువ ధరలకు ఎరువులను అందుబాటులో ఉంచేలా సబ్సిడీని పెంచినట్లు వివరించారు.
పెరిగిన మద్దతు ధరలు పంటలవారీగా
జొన్న రూ.2970కి
సజ్జలు రూ.2350,
రాగి రూ.3578
మొక్క జొన్న రూ.1962
కందిపప్పు రూ.6600
పెసరపప్పు రూ.7755,
మినప పప్పు రూ.6600
వేరుశనగ రూ.5850
ప్రొద్దుతిరుగుడు రూ.6400
సోయాబీన్ రూ.4300
నువ్వులు రూ.7830,
పత్తి రూ.6080, పత్తి
(పొడవు రకం) రూ.6380,
నైగర్ సీడ్ ధర రూ.7287

RELATED ARTICLES

Most Popular

Recent Comments