స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన సీఎం కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని కోలన్ పల్లి పీఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్ రెడ్డి అన్నారు. రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో కోలన్ పల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాయపర్తి మండల ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామ చంద్రా రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచ్ కర్ర సరిత రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments