స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపూర్ ): ఖానాపూర్ మండలంలో ఆదివారం పీఏసీఎస్ ఖానాపూర్ పరిధిలోని ఖానాపూర్, మంగళవారిపేట, ధర్మారావుపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామస్వామి నాయక్ మాట్లాడుతూ.. ప్రతీ రైతు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కుంచారపు వెంకట్ రెడ్డి, డైరెక్టర్స్ వేములపెళ్ళి సునీత, సీఈఓ ఆంజనేయులు ఆబోతు అశోక్ భుషబోయిన రాజు, సొంటి లక్ష్మయ్య, గంగాధరి రమేష్, సర్పంచులు ఎంపీటీసీలు రైతులు సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments