Tuesday, December 3, 2024
Homeసినిమాఓటీటీలోకి రాధేశ్యామ్..

ఓటీటీలోకి రాధేశ్యామ్..

ఏప్రిల్ 1న జీ ప్రైమ్‌లో..
స్పాట్ వాయిస్, సినిమా డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాధే శ్యామ్. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూవీ ప్రసారం కానుంది. తాజాగా అందుకు సంబంధించిన ఒక వీడియో ను ప్రైమ్ వీడియో షేర్ చేసింది. తెలుగులో మాత్రమే కాకుండా, మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియో లో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments