ఆపరేషన్ సింధూర్
అర్ధరాత్రి 1:44 కు పాకిస్థాన్ పై దాడి..
9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడి
స్పాట్ వాయిస్, బ్యూరో: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
దాడులు చేసింది ఈ ప్రాంతాల్లోనే..
* బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుభాన్ ఉగ్రస్థావరం
* మురిడ్కేలోని మర్కాజ్ తొయిబా ఉగ్రస్థావరం
* తెహ్రా కలాన్‌లోని సర్జల్ ఉగ్రస్థావరం
* సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా ఉగ్రస్థావరం
* బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్రస్థావరం
* కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం
* కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్ ఉగ్రస్థావరం
* ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్ ఉగ్రస్థావరం
* ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం
Recent Comments