మనకూ మంచిరోజులొచ్చాయంటూ కామెంట్స్
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మీ పథకం’లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది. ఈ పథకం మొదలైనప్పటి నుంచి బస్సుల్లో రద్దీ అనుహ్యంగా పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఇక బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. పురషులు వారిని తమకు కేటాయించిన సీట్లలో నుంచి మహిళలను లేమ్మని చెప్పలేక.. గంటల తరబడి నిల్చొని ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు పరుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు.
మగజాతికి గర్వకారణమంటూ..
హైదరాబాద్ ఎల్బీ నగర్- ఇబ్రహీంపట్నం రూట్‌లో ‘పురుషులకు మాత్రమే’ అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు దర్శనమిచ్చింది. గతంలో ‘మహిళలకు మాత్రమే’ అనే బోర్డుతో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు ‘పురుషులకు మాత్రమే’ అని బస్సు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమ బాధలు అర్థం చేసుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆనందంగా చెప్పుకొంటున్నారు. మగాళ్లకు కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మగవాడు ధైర్యంగా ఇది నా సీటే అని కూర్చుని ప్రయాణించే రోజులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో కామెట్స్ పెడుతున్నారు.
మగాళ్లకు మాత్రమే..
RELATED ARTICLES
Recent Comments