Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఒక వైపు ఎండా.. మరో వైపు వాన

ఒక వైపు ఎండా.. మరో వైపు వాన

ఒక వైపు ఎండా.. మరో వైపు వాన
రేపటి నుంచి వాతావరణంలో పెనుమార్పులు
మూడు రోజులు వర్షాలు..

స్పాట్ వాయిస్, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు..మరోవైపు వానలూ పడనున్నాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఎక్కడ.. ఎప్పుడు..
గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మూడు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో 36-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments