వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా..
వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షికి బయోడేటా అందజేత
స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెరుమాండ్ల రామకృష్ణ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిబద్ధతగల కాంగ్రెస్ నాయకుడిగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. అలాగే.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన శ్రమించారు. పల్లెలు, పట్టణాలు, కాలనీలు అన్ని తిరుగుతూ.. బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు. ఆయన వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన అందరికీ సుపరిచితుడు కావడంతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ కోసం క్షేత్ర స్థాయి నుంచి ఢిల్లీ వరకు తన పని చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తనకు టికెట్ కేటాయిస్తే వరంగల్ లో కాంగ్రెస్ జెండా కచ్చితంగా ఎగురుతుందనే ధీమాను అధిష్టానానికి విమర్శిస్తున్నారు. పార్టీ పెద్దలందరినీ కలుస్తూ.. తను పార్టీ కోసం చేసిన పనులు, గెలుపు కోసం కష్టపడిన తీరును వివరిస్తున్నారు. తాజాగా ఎంపీ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్ లో ఢిల్లీకి పంపిచనున్న నేపథ్యంలో బుధవారం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హైదరాబాద్ లో రాష్ట్ర పెద్దలు కలిశారు. ఇందులో భాగంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ శర్మ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ ఎంసీ సీటు కేటాయించాలని పెరుమాండ్ల రామకృష్ణ కోరగా.. వారంతా సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. అనంతరం పెరుమాండ్ల మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తన బయోడేటాను అందజేశానన్నారు. ముఖ్యమంత్రి మీద పూర్తి నమ్మకం ఉందని, విద్యార్థి దశ నుంచి పార్టీ కోసం కష్టపడుతూ వచ్చానని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని , పేద బడుగు బలహీన ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా రామకృష్ణ కోరారు.
Recent Comments