దామెర ఎస్సై హరిప్రియ
స్పాట్ వాయిస్, దామెర: విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని దామెర ఎస్సై హరిప్రియ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘సైబర్ సురక్షిత జాతీయ భద్రత’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై హరిప్రియ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావొద్దన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయ బృందం, జీపీ కో- ఆప్షన్ సభ్యులు హింగె బాబురావు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES
Recent Comments