Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుసంబురంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

సంబురంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

సంబురంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

స్పాట్ వాయిస్ , కమలాపూర్: మండలంలోని కానిపర్తి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 23 సంవత్సరాల తర్వాత కలుసుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అప్పుడు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

 

పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకొని బాగోగులు తెలుసుకొని ఆత్మీయ ఆనంద పలకరింపులతో వారి వారి పిల్లల్ని పరిచయం చేస్తూ పులకరించిపోయారు. మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ అసాన్ ఆలీ, ప్రకాశం రాజమౌళి స్వర్ణలత రమేష్ దాసరి రమేష్ పూర్వ విద్యార్థులు మమత, శ్రీలత, స్రవంతి, రాధిక, సృజన, సుమలత, రమాదేవి, కళ్యాణి, ప్రతాప్, చిరంజీవి, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments