ఇది విన్నారా..!?
పాత ప్యాంట్ @ రూ.94 లక్షలు..
స్పాట్ వాయిస్, డెస్క్: జీన్ ప్యాంట్ ఖరీదు అక్షరాల రూ.94 లక్షలు.. చాల్లే ఎటకారం అనుకుంటున్నారా., లేదంటే పెద్ద చెప్పొచ్చారులే అని తీసిపారేస్తున్నారా.! అదీ కాదంటే నేనేమైనా తప్పుగా చూశానా.. మిస్టేక్ గా చదివానా.. అని మళ్లీ మళ్లీ తిరగేస్తున్నారా..? అలాంటి అనుమానాలేవీ అవసరం లేదు. మీరు చూసింది నిజమే.., మీరు చదివింది అక్షరాల వాస్తవం. ఆ జీన్స్ ఖరీదు ముమ్మాటికి రూ.94 లక్షలు. అలాగని దానిలో ఏమైనా వజ్ర వైఢుర్యాలు, బంగారు ఆభరణాలు.., కెంపులు వంటివి పొదిగారు అనుకుంటే మళ్లీ తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది నిజంగా పాత ప్యాంటే. అందునా సుమారు 165 ఏళ్ల కిందటి జీన్ ప్యాంట్. అంత పురాతమైనది కాబట్టే ఓ ఔత్సాహికుడు ఇష్టపడి మరీ వేలం దానిని దక్కించుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి..
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి పనామా మీదుగా న్యూయార్ కు వెళ్తున్న ఓ నౌక 1857 సెప్టెంబరు 12న తుఫానులో చిక్కుకుని నార్త్ కరోలినా తీరంలో మునిగిపోతుంది. ఆ నౌక నుంచి ఈ మధ్యే ఓ ట్రంక్ పెట్టెను కనుక్కున్నారు. అందులో నుంచి ఓ పురాతమైన జీన్స్ జతను వెలికితీశారు. దానిని వేలం వేస్తే ఏకంగా అత్యంత పురాతనమైన జీన్స్ జతగా రికార్డు కెక్కి 114,000 యూఎస్ డాలర్లు (రూ.94 లక్షలు) ధర పలికింది. కాగా, భారీ ధర పలికిన ఈ జీన్స్ పై ఐదు బటన్ల ఫ్లై (తెలుపు రంగు) ఉంది. అత్యంత ప్రసిద్ధ డెనిమ్ నిర్మాతల్లో ఒకరైన లెవీ స్ట్రాస్ ఈ తెల్లని జీన్స్ ప్యాంట్లను తయారు చేశారని కొందరు భావిస్తుండగా, ఆ ప్యాంట్‌లను ఎవరు సృష్టించారో స్పష్టంగా తెలియదని పలువురు పేర్కొంటున్నారు.
Recent Comments