నూనె ధరలు తగ్గించండి..
కంపెనీలను ఆదేశించిన కేంద్రం..
వారంలో రూ.10 తగ్గే చాన్స్..
స్పాట్ వాయిస్, డెస్క్: వారం రోజుల్లో దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలను లీటర్‌కు రూ.10 వరకు తగ్గించాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, దేశీయంగా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తగ్గించాలని కోరింది. దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ నూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాలని సూచించింది. ప్రస్తుతం వంట నూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతులే తీరుస్తున్నాయి. గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా వంటనూనెల ధరలు ప్రియమయ్యాయి. మళ్లీ అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టడం తో స్థానికంగా ధరలు తగ్గించాలని పేర్కొంది. గత నెలలో నూనె ధరను లీటర్‌కు రూ.10-15 వరకు కంపెనీలు తగ్గించాయి.
Recent Comments