Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలువర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన అధికారులు

వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన అధికారులు

స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం): ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను సోమవారం అధికారులు పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న, వర్షానికి కూలిన ఇళ్లను పరిశీలించి ప్రజలకు తగు సూచనలు సలహాలు అందించారు. వర్షానికి గోడలు దెబ్బతిని కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో నివాసం ఉండొద్దని చెప్పారు. పిల్లలు, పెద్దలు కరెంటు తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాకాల చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో పాకాల నీటిమట్టం సామర్థ్యం 31అడుగులకు ప్రస్తుతం సోమవారం 24.5 అడుగుల కు చేరుకుంది. దీనితో పాకాల సరస్సును తూములను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పవన్ కుమార్, తాసిల్దార్ సుభాషిని, ఎంపీడీఓ సుమన వాణి, ఎంపీడీవో పర్వీన్ కైసర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments