హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తప్పసరి..
సెప్టెంబర్ 30 డెడ్ లైన్.. లేదంటే కేసులే..
స్పాట్ వాయిస్, బ్యూరో: 2016 ఏప్రిల్ ఒకటో తేదీకంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోగా అన్ని రకాల వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలని గడువు విధించారు. ఆ తరువాత కొత్త నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్డు ఎక్కితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. వాహనాల రకాలను బట్టి నెంబర్ ప్లేటుకు కనిష్ఠంగా రూ.320, గరిష్ఠంగా రూ.800 వరకు ఛార్జీలను ఖరారు చేశారు. ఈ నెంబర్ ప్లేటు ఉంటేనే వాహనానికి సంబంధించి బీమా, సామర్థ్యం, కాలుష్య ధ్రువీకరణ పత్రాలతో పాటు రవాణాశాఖ నుంచి ఇతర సేవలను పొందే వీలు ఉంటుంది. సాధారణ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలనుకునే వాహనదారులు www.siam.in వెబ్‌సైట్‌లో వాహనం వివరాలను నమోదు చేసుకొని బుక్ చేసుకోవాలి. తరువాత హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ ఎంపిక చేసుకొని, వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి, నిర్దేశిత రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కొత్త నంబరు ప్లేటు వచ్చాక, దాన్ని వాహనానికి బిగించి ఫొటో తీసి అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనే నిబంధన విధించారు.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తప్పసరి..
RELATED ARTICLES
Recent Comments