ఎన్ ఎస్ఆర్ పాల డెయిరీని మూసివేయాలి..
తిరుపతి యాదవ్
కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్
స్పాట్ వాయిస్, దామెర: గడువు దాటినా పదార్థాలతో పాలను తయారు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న సంపత్ రావు ఎన్. ఎస్.ఆర్ పాల డెయిరీని శాశ్వతంగా మూసివేయాలని కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు.అనేక సార్లు అధికారులు చర్యలు తీసుకున్నా.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్ .ఏస్.ఆర్ సంపత్ రావు రాజకీయ నేతల అండదండలతో అధికారుల చర్యలను తెలికగా తీసుకొని
ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజారోగ్యం పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, డెయిరీ లో తీసుకున్న శ్యాంపిల్స్ రిపోర్టులను మార్పించే పనిలో సంపత్ రావు ఉన్నారని ఆరోపించారు.
ఎన్ ఎస్ఆర్ డెయిరీని మూసివేయాలి
RELATED ARTICLES
Recent Comments