నర్సంపేటకు మెడికల్ కళాశాల
జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్,నర్సంపేట: నర్సంపేట కు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. ఇందుకు సంబందించిన జీవో నెంబర్ 83 ను విడుదల చేస్తూ వైద్య,ఆరోగ్య శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నర్సంపేటకు వైద్య కళాశాల ఆలోచన ఎప్పటినుండో ఉందన్నారు. సీఎం కేసీ ఆర్ కు నర్సంపేటపై ఉన్న ప్రత్యేక ప్రేమకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నర్సంపేట ప్రజలకు ఇచ్చిన గొప్ప కానుక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత 5 సంవత్సరాల నుండే మెడికల్ కాలేజి ఏర్పాటుకు తాను ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పెద్ది తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పేద ప్రజలకు అందుబాటులో విద్యా-వైద్యం అందుతున్నాయన్నారు.
Recent Comments