Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలుదారుణంగా ఎమ్మెల్యే దత్తత కాలనీ..?

దారుణంగా ఎమ్మెల్యే దత్తత కాలనీ..?

 

18వ వార్డులోని లెనిన్ నగర్ లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

బీజేపీ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

స్పాట్ వాయిస్ నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని 18వ వార్డులో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని నర్సంపేట బీజేపీ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం అయన 18 వ వార్డులోని లెనిన్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రాణా మాట్లాడుతూ గత ఎలక్షన్ లకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లెనిన్ నగర్ ను దత్తత తీసుకుంటానని అన్నారని ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఈ కాలనీ గురించి మర్చిపోయాడన్నారు. లెనిన్ నగర్ మొత్తంలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేకపోవడం దారుణమన్నారు. డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్డు మీద కి వచ్చి అక్కడనుండి ఇళ్ళల్లోకి వస్తోందన్నారు. కాలనీలో కొంత మందికి మాత్రమే ఇళ్ళ పట్టాలు వచ్చాయన్నారు. కాలనీలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు కానీ ఖాళీ స్థలం ఉన్నవారికి 5లక్షల పథకం కూడా అందలేదన్నారు. ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా కార్పోరేషన్ రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వయాన ఎమ్మెల్యే దత్తత తీసుకుంటానన్న కాలనీయే ఇలా ఉంటే పట్టణ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న లెనిన్ నగర్ లో పారిశుద్ధ్యం పడకేసి పరిస్థితి దారుణంగా ఉందని స్థానిక అధికారులు కాలనీ లోని సమస్యలపై ఇప్పటికైనా దృష్టి సారించాలని రాణా కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి లెనిన్ నగర్ ను అభివృద్ధి చేసి అయన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని గోగుల రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments